ADB: ఇందిరాగాంధీ అంటేనే పేదల పక్షపాతి అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఒక మహిళగా ఇందిరా గాంధీ దేశానికి ఎన్నో సేవలందించిందని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అభివృద్ధి చేసే దిశగా సాగుతుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు.