పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణా రావు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు, మోసం, ఇతర సమస్యల కోసం 111 ఫిర్యాదులు అందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.