GDWL: తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా పెంచిన బీమా సౌకర్యాన్ని అర్హులైన కార్మికులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం బీమా పెంపుపై అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సహజ మరణం పొందిన కార్మికులకు గతంలో రూ. 1 లక్ష ఉండగా, దాన్ని రూ. 2 లక్షలకు పెంచామని తెలిపారు.