దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. జైస్వాల్(58), సుందర్(48) మినహా.. మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమవడంతో భారత్ 201 పరుగులకే ఆలౌటైంది. దీంతో, భారత్ ఫాలోఆన్‌లో పడింది. SAకు తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. యాన్సెన్ 6 వికెట్లు, హార్మర్ 3 వికెట్లతో విజృంభించారు.