SKLM: క్రీడలతోనే మానసిక ఉల్లాసం అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. పోలాకి మండల ఈదులవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రిగ్స్ మండల స్థాయి ఆటలు పోటీలను స్థానిక ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయని అన్నారు.