BHPL: జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రస్తుత MLC, ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఈరోజు బాధితుల నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం వారిని నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.