W.G: సర్వశిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ సోమవారం భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు బాబాజీ మాట్లాడుతూ.. గత సమ్మె కాలంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. రిటైర్మెంట్ వయసును 62 పెంచాలన్నారు. అనంతరం డీఈవోకి వినతిపత్రం అందించారు.