VZM: 2019లో గరివిడిలో మహిళపై అత్యాచారం చేసిన బొండపల్లి నివాసి సవిరిగాన సూర్యనారాయణకు 12 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించినట్లు SP దామోదర్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయగా, PP సత్యం సమర్థ వాదనలతో నిందితుడి నేరం కోర్టులో రుజువైంది.