E.G: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, సాగును లాభసాటిగా మార్చడమే ఏకైక లక్ష్యంగా ‘రైతన్నా మీకోసం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో సోమవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ర్యాలీ చేశారు.