BDK: ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం తహసీల్దార్‌కు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఇవాళ వినతిపత్రం అందజేశారు. నాయకులు సక్రు మాట్లాడుతూ.. గార్ల, బయ్యారం, కన్నాయిగూడెం, పరిధిలోని రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. గత 60 సంవత్సరాల పైచిలుకు నుంచి వ్యవసాయం చేసుకుంటున్నా భూములకు పట్టాలు రావడంలేదని తెలిపారు.