KRNL: అరెకల్ గ్రామంలో శిక్షణ (ట్రైనింగ్)లో ఉన్న IAS, ఐపీఎస్ అధికారులను సోమవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఘనంగా సన్మానించారు. అధికారులకు శాలువా కప్పి, పూలమాలలు వేసి తమ గౌరవాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.