CTR: సోమల మండలం నంజంపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు చెకుముకి టాలెంట్ టెస్టులో ప్రతిభ చూపినట్లు హెచ్ఎం కుసుమాంబ సోమవారం తెలిపారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ సంబరాలు-2025లో నవంబర్ 23న జరిగిన జిల్లా స్థాయి పోటీలలో విద్యార్థులు ప్రతిభ చూపారని ఆమె చెప్పారు. విద్యార్థులు మునేష్, కావ్య శ్రీ, లాస్య శ్రీని అభినందించారు.