GNTR: తెనాలి జంగమ సంక్షేమ సంఘం నాయకులు బసవ మందిరం భూమిని పరిరక్షించాలని కోరుతూ సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం అందజేశారు. వందేళ్ల కితం సోము బసవయ్య రాజమ్మ దంపతులు ఇచ్చిన భూమి చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయిందన్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఆధీనంలో మిగిలి ఉన్న బుర్రిపాలెం రోడ్డులోని ఎకరం భూమిని కాపాడాలని వినతి పత్రం అందజేశారు.