ADB: మద్యం సేవించి ఆటో నడిపి బోల్తా కొట్టించి ఒకరి మృతికి కారణమైన షేక్ జావీద్ పాషా (35) అనే ఆటో డ్రైవర్‌కు సెషన్స్ జడ్జి రాజ్యలక్ష్మి పది సంవత్సరాల కఠినకారాగార శిక్ష రూ.8500 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. 2021 మార్చ్ 24న సోనాల నుండి బోథ్‌కు ఆటో వస్తున్న క్రమంలో డ్రైవర్ జావీద్ పాషా మద్యం సేవించి అజాగ్రత్తగా నడిపారన్నారు.