WNP: గోపాలపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మెగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొలువు దీరిన ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు.