TG: ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఆస్పత్రుల్లో కనీసం సూది, మందులు, దూది కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. కేంద్రప్రభుత్వం ‘నేషనల్ హెల్త్ మిషన్’ పేరుతో పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నప్పటికీ.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడంలో విఫలమవుతుందన్నారు.