KRNL: కల్లూరు మండలం చిన్నటేకురు గ్రామంలో రైతు వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్నా – మీకోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామంలో రైతుల ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు అండగా అమలుచేసిన పథకాల గురించి అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ది కోసం అనేక మార్పులు తెచ్చిందన్నారు.