టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక ప్రకటన చేసింది. సిమ్‌ను దుర్వినియోగం చేస్తే దానికి సంబంధించిన పూర్తి బాధ్యత మొబైల్ యూజర్‌దే అని స్పష్టం చేసింది. సిమ్ కార్డును సైబర్ మోసాలు లేదా చట్టవ్యతిరేక కార్యక్రమాలలో వినియోగించినట్లయితే.. ఆ సిమ్ ఓనర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాయ్ హెచ్చరించింది.