AP: మావోయిస్టుల ఎన్కౌంటర్లపై CPM నేత రాఘవులు స్పందించారు. యుద్ధం మావోయిస్టులపై కాదని.. గిరిజనులపై చేస్తున్నారని మండిపడ్డారు. అటవీ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని.. గిరిజనులను అడవి నుంచి పంపించాలని చూస్తున్నారని ఆరోపించారు. అన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనని ధ్వజమెత్తారు. 26న సమ్మెకు సీపీఎం మద్దతు ఇస్తుందని తెలిపారు.