నంద్యాల ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) శాఖకు ఇటీవల రాజంపేటలో జరిగిన 67వ ఆంధ్రప్రదేశ్ ఐఎంఏ రాష్ట్ర సదస్సులో నాలుగు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కాయి. ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ బానుశాలి చేతుల మీదుగా మీడియం బ్రాంచ్, ఉత్తమ అధ్యక్షులు, ఉత్తమ సామాజిక సేవ, మహిళా విభాగాల్లో నంద్యాల ఐఎంఏ అవార్డులు అందుకుంది.