W.G: భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.