SKLM: కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. సోమవారం పోలాకి మండలంలో చల్లబంద, కుసుమ పోలవలస గ్రామాల్లో “రైతన్న – మీకోసం” కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు రైతుల ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. రాబోయే 5 ఏళ్ళలో రైతుని రాజును చేయడానికి ప్రభుత్వం చర్య చేపడుతుందన్నారు.