ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం నిశాన్ ఘాట్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యుత్ శాఖ SC కార్యాలయం ముందు CPI శ్రేణులు సోమవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు మెస్రం భాస్కర్ మాట్లాడుతూ.. గత 9 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేక రాత్రి వేళల్లో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.