TPT: శ్రీకాళహస్తిలో రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. సిగ్నల్ లేని రోడ్లు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, ఇరువైపులా ఆక్రమణలు, రోడ్లపై సరుకుల నిల్వల వల్ల మార్గాలు కిక్కిరిసిపోతున్నాయి. పాఠశాలల ప్రారంభం, ముగింపు సమయంలో పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.