MBNR: నగరంలోని న్యూటౌన్ ప్రాంతంలో సోమవారం ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు జారీ చేశారు. హెల్మెట్ తప్పనిసరి, మైనర్లు వాహనాలు నడపకూడదని, ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణం నిషేధమని హెచ్చరికలు ఇచ్చి, నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు.