ఇంధన సేవల్లో ఒకప్పుడు దిగ్గజ సంస్థగా పేరొందిన బ్రిటన్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ పెట్రోఫాక్ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంది. దీంతో ఆ సంస్థ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే వందల మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించింది. ఇందులో పనిచేస్తున్న మిగితా వారి భవిష్యత్ కూడా ఆందోళనకరంగా మారింది. కాగా, ఈ సంస్థలో భారతీయులు 8,500 మంది పనిచేస్తున్నారు.