ముంబై రైల్వే స్టేషన్లో మే 20న నాలుగేళ్ల ఆరోహి అనే చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. పోలీసులు వేసిన పోస్టర్ల ఆధారంగా వారణాసిలోని అనాథాశ్రమానికి చేరిన ఆ చిన్నారిని ఓ రిపోర్టర్ గుర్తించారు. ఆరోహి 6 నెలల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరింది. ముంబైకి వచ్చిన ఆరోహి తన తల్లిదండ్రుల కంటే ముందు అక్కడున్న పోలీసు అధికారులను హత్తుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.