MBNR: కోయిలకొండ చౌరస్తా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోయిలకొండ వైపు వెళ్తున్న ఆటోను కారు వేగంగా ఢీకొట్టడంతో, దార్వాడ మండలం అంకూర్ తండాకు చెందిన సక్కుబాయి (56), అఖిల్ కాళ్లు విరిగిపోయి, తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వారికి ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆస్పత్రికి తరలించారు.