BDK: భద్రాచలంలో గోదావరి కరకట్ట ప్రాంతంలోని కళ్యాణకట్ట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనదని ఇవాళ స్థానికులు వెల్లడించారు. మరణించిన వ్యక్తి వివరాలు తెలిస్తే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు. మృతుడి వయస్సు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందని, తెల్లని జుట్టు, గడ్డంతో బక్కపలుచగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.