E.G: బిక్కవోలు మండలం కొంకుదురుకి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త బందుల సుబ్బారావు ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబానికి జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు ఆదివారం తాడేపల్లిలో రూ. 5 లక్షల చెక్కును అందజేశారని బిక్కవోలు మండల జనసేన అధ్యక్షుడు ఇందల వీరబాబు తెలిపారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.