ATP: గుంతకల్లు మండలం నెలగొండ గ్రామపంచాయతీలో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ మాట్లాడుతూ.. అధికారులకు గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.