BDK: పినపాక మండలం దుగ్నేపల్లి గ్రామంలో యాగంటి అనసూర్య అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనసూర్య భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.