సంగారెడ్డి(D) సదాశివపేట (M) నందికందిలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం శిల్పకళా వైభవానికి నిదర్శనం. 11వ శతాబ్దంలో కళ్యాణి చాణిక్యులు ఈ ఆలయాన్ని రాతితో నిర్మించారు. ఆలయ ముఖద్వారంలోని రంధ్రాల నుంచి సూర్య కిరణాలు నేరుగా మహా శివుడిపై పడే విధంగా తీర్చిదిద్దారు. ఆలయంపై మొగలులు దాడి చేయగా నంది భారీ శబ్దంతో రంకెలు వేసిందని దీంతో వారు పారిపోయినట్లు చరిత్ర చెబుతోంది.