నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలో, నెల్లూరు నగర సిటీ కార్పొరేటర్లు సోమవారం ఉదయం 10.30 గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఆయన కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ భేటీలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం, దాని గెలుపునకు సంబంధించిన వ్యూహాలపై చర్చించనున్నారు.