W.G: వైసీపీ హయాంలో మంత్రి నిమ్మల రామానాయుడుపై జరిగిన దాడి ఘటనపై పాలకొల్లులో ఆదివారం సీఐడీ బృందం విచారణ జరిపింది. రాజమండ్రి సీఐడీ ఏఎస్పీ ఆస్మ ఫరీన్ నేతృత్వంలో జరిగిన ఈ విచారణలో ఘటన జరిగిన ప్రాంతమైన టిడ్కో గృహాల కాలనీలో లబ్ధిదారులను, సాక్షులను విచారించారు. అప్పట్లో దాడిపై పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు.