ELR: వాగులో స్నానానికి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు మునిగపోయిన ఘటన కామయ్య పాలెం పంచాయతీ బొత్తప్పగూడెంలో ఆదివారం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేటలోని దొంతికుంట కాలనికి చెందిన గుమ్మళ్ల యశ్వంత్ స్నేహితులతో కలిసి స్నానానికి సంగం వాగులో దిగి గల్లంతయ్యాడు. స్థానికుల సహాయంతో వాగులో గాలించి బాలుడి డెడ్ బాడీని బయటకు తీశారు.