WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఇవాళ వివిధ సరుకుల ధరలు ఇలా నమోదయ్యాయి. పత్తి క్వింటాల్‌కు రూ. 6880, మక్కలు బిల్టి రూ. 1970, తేజ మిర్చి క్వింటాల్‌కు రూ. 15021, 341 (AC) రూ. 17500, వండర్ హాట్ మిర్చి రూ. 18000, దీపికా మిర్చి రూ. 14500గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.