టీమిండియా మేనేజ్మెంట్ బ్యాటర్లతో కుర్చీలాట ఆడుతోందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోల్‌కతా టెస్టులో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన సుందర్.. గౌహతి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌ల్లో 8వ స్థానంలో రావడంపై మాజీ ప్లేయర్లు, ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. సుందర్ చివరి 7 ఇన్నింగ్స్‌ల్లో వేర్వేరు స్థానాల్లో(5, 8, 9, 7, 3, 3, 8) బ్యాటింగ్ చేయడమే ఇందుక్కారణం.