BDK: టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులు హైమావతి కిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పేదవాడు సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇళ్లు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.