AP: తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రెక్ ఫెయిల్ కావడంతో ఓ కారు బోల్తా పడింది. మొదటి ఘాట్ రోడ్డు 2వ కిలోమీటర్ మైలురాయి వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలతో భక్తులు బయటపడ్డారు. కారు బోల్తా పడి రోడ్డుకి అడ్డంగా ఉండటంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన భక్తులు తమిళనాడు వాసులుగా పోలీసుల గుర్తించారు.