సీజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ గవాయ్ తనకు కేటాయించిన అధికారిక కారును రాష్ట్రపతి భవన్ వద్ద విడిచిపెట్టారు. ఈ కారును నూతన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్‌కు కేటాయించనున్నారు. నిబంధనల ప్రకారం సీజేఐగా పదవీ విరమణ చేసిన అనంతరం మాజీలు తాము ఉంటున్న అధికారిక నివాసాలను, ప్రభుత్వం ఇచ్చే ఇతర సౌకర్యాలను వీడాల్సి ఉంటుంది.