VZM: మైక్రో ఫైనాన్స్ వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని, మహిళలుపై ఆ సంస్దల వేధింపులు ఆపాలని ఇవాళ స్దానిక కలెక్టరేట్ ముందు ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అక్రమాలకు పాల్పడుతున్న ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మహిళలకు బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని, వారిపై జరిగే అత్యాచారాలు, హత్యలు నుంచి కాపాడాలని కోరారు.