‘రాజాసాబ్’ ఈవెంట్లో ‘నేను వారిలా కాలర్ ఎగరేయను’ అని డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలపై NTR ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో మారుతి వారికి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘ప్రతి అభిమానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు. ఎవరినీ అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. NTR అభిమానులందరి పట్ల అపారమైన గౌరవం ఉంది. మీరు దాని వెనకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.