AP: మాజీ సీఎం జగన్‌కు ఈర్ష్య, అసూయ పెరిగిపోయిందని మంత్రి అనగాని విమర్శించారు. కూటమి పాలనలో రైతులు సంతోషంగా ఉంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులకు ఆత్మహత్యలే మిగిలాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఏడాదికి 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. తమ ప్రభుత్వ వచ్చిన తర్వాత రైతులు ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడుతున్నారని చెప్పారు.