SKLM: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఇవాళ ఎల్ఎన్ పేట మండలంలోని స్కాట్ పేట గ్రామంలో జరిగిన ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభమని పేర్కొన్నారు.