W.G: ఓజీ చిత్రం ఫేమ్, నటి ప్రియాంక మోహన్ ఇవాళ తణుకులో సందడి చేశారు. తణుకు పట్టణంలో వేంచేసిన స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామ కృష్ణవధానులు పాల్గొన్నారు.