KDP: ఖాజీపేట మండలంలోని నాగనాదేశ్వర కోన కొండపై వాహనాల పార్కింగ్ అభివృద్ధి పనులను మండల నాయకుడు ఇరగంరెడ్డి ప్రతాప్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యం కోసమే ఈ పనులు చేపట్టామని ఆలయ ఛైర్మన్ సూర్య సుమన్ రెడ్డి తెలిపారు. పనులు పూర్తయితే భక్తుల వాహనాల పార్కింగ్ సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.