AP: మాజీ సీఎం జగన్కు ఎంపీ అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చారు. ఏడాదిన్నరలో తాము అన్నదాత సుఖీభవ నిధలు విడుదల చేసినట్లు తెలిపారు. మూడో విడతలో రూ.6 వేలు ఇస్తామని చెప్పారు. ప్రకృతి విపత్తుల్లో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించారని అన్నారు. ఐదేళ్లలో రైతుల కోసం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. కోర్టు హాజరును కూడా జగన్ రాజకీయ ర్యాలీగా మార్చారని విమర్శించారు.