CTR: పుంగనూరు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ కాలనీ వద్ద UNR కూడలిలో సోమవారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 219వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదురించి పోరాడి సమరశంఖం పూరించి, తెలుగు వారి పౌరుషాన్ని రుచి చూపించిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు.