ADB: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్లు అందజేయాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నగేశ్ కోరారు. సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మద్యం టెండర్లలో, పార్కుల నిర్వహణలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు.